చరణ్ ధృవ సెన్సార్ పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతాజా చిత్రం ధృవ. ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తని ఓరువన్ రీమేక్ గా రూపొందిన ధృవ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రంలో మెగాపర్ స్టార్ రాంచరణ్ పవర్ ఫుల్ ఐ.పి.యస్ ఆఫీసర్ ధృవగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com