close
Choose your channels

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

Wednesday, May 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్‌లో భాగంగా చరణ్, కియారాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం శ‌ర‌వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నా.. దీనికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమా అడ్డంకిగా మారనున్నట్టు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.. చిరు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సైరా' సినిమా చిత్రీకరణ నెమ్మదిగా సాగుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని ముందుగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకి అందివ్వాలని ప్లాన్ చేసారు. ఒకవేళ ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉంటే.. చరణ్, బోయపాటి మూవీని దసరాకి విడుదల చేయనున్నారు. 'సైరా' గనక సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే మాత్రం చరణ్, బోయపాటి చిత్రం సంక్రాంతికి విడుదలవడం ఖాయంగా ఉంది.

అందుకే చరణ్ తను నటిస్తున్న సినిమా విడుదల తేదీని కొంత టైమ్‌ తీసుకుని ప్రకటించమని నిర్మాతను కోరినట్టు సమాచారం. ఏది ఏమైనా.. 2019 సంక్రాంతికి కొణిదెల వారి చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతోందన్న మాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment