ఆరెంజ్ మూవీ పై చరణ్ కామెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత నటించిన చిత్రం ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్..ఓ రేంజ్ లో విజయం సాధిస్తుందనుకున్నారు. కానీ ఆరెంజ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఇటీవల బ్రూస్ లీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో..
ఆరెంజ్ ప్రస్తావన వచ్చినప్పడు చరణ్ మాట్లాడుతూ...నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఖాళీ దొరికితే నేను లవ్ స్టోరి ఉన్న మూవీసే చూస్తుంటాను. నేను చేసిన లవ్ స్టోరి ఆరెంజ్ ఆడలేదు. కానీ ఆరెంజ్ సినిమా అంటే చాలా ఇష్టం. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. ఈ పాటలన్నీ ఇష్టం. ఇప్పటి వరకు తనకు ఆరెంజ్ ఆడియో సక్సెస్ అయినట్టుగా మరే సినిమా ఆడియో సక్సెస్ కాలేదంటూ తన మనసులో మాట చెప్పారు చరణ్. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments