ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌పై డామినేషన్… మీడియాకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. RRR విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రామ్, భీమ్ పాత్రలను, ఆయా పాత్రల హీరోయిజాన్ని జక్కన్న సమానంగా చూపించినప్పటికీ, టాక్ మాత్రం మరోలా వస్తోంది. కొందరు ఎన్టీఆర్ కంటే చరణ్‌కు మంచి పాత్ర లభించిందని అంటే, మరికొందరేమో చరణ్‌ని డామినేట్ చేస్తూ సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ తన భుజాలపై వేసుకున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇద్దరు హీరోలు మాత్రం తమ తమ పాత్రలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నారు.
కాగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్‌ను అందుకోవడంతో చిత్ర యూనిట్ ముంబైలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుపుకుంది. డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా తారాగణం, టెక్నీషియన్లు మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, సీనియర్ నటుడు జితేంద్ర, పాలక్ తివారీ, హుమా ఖురేషి, దర్శక నిర్మాత కరణ్ జోహర్, జావేద్ అక్తర్ వంటి స్టార్స్ కూడా ఈ ఈవెంట్‌కు విచ్చేశారు.
అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఈవెంట్‌ను కవర్ చేసేందుకు హాజరైంది. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు యూనిట్ సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలో చరణ్‌ను ఇబ్బంది పెట్టేలా ఒక సమాధానం సంధించారు. మీరు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను డామినేట్ చేశారని ప్రశ్నించారు. దీనికి చరణ్ ధీటుగా బదులిచ్చారు. మా ఇద్దరికీ రాజమౌళి సమాన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా వుందని చెర్రీ చెప్పారు. తన కెరీర్‌లో మరే ఇతర సినిమాలో పని చేయడాన్ని తాను ఇంతగా ఆస్వాదించలేదన్నారు. తారక్‌తో నా ప్రయాణం బాగా నచ్చిందని.. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు’ అని చరణ్ అన్నారు. ఈ సమాధానంతో ఎన్టీఆర్ కూడా ఏకీభవించడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com