చరణ్ కోసం సింగర్ గా మారిన కొరియోగ్రాఫర్

  • IndiaGlitz, [Monday,April 04 2016]

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రాంచరణ్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు. వివరాల్లోకెళ్తే..చరణ్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ పై స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేసి మార్చి 27న విడుదల చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాలు కారణంగా ఆ సాంగ్ విడుదల చేయలేకపోయాడు. ఈ సాంగ్ ను జానీ మాస్టర్ పాడాడట. ఈ సాంగ్ లో రాంచరణ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఉంటుందట. గతంలో జానీ మాస్టర్ భార్య ఆపరేషన్ సమయంలో కూడా చరణ్ సపోర్ట్ గా నిలిచాడు. అప్పటి నుండి జానీ మాస్టర్ చరణ్ పెద్ద ఫ్యాన్ అయిపోయాడట.

More News

కందిరీగ కాంబినేష‌న్ లో సినిమా

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన కందిరీగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన&

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖపట్నంలో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది.

ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన ప్రియాంక చోప్రా..

అందం - అభిన‌యం తో పాటు ఆత్మ‌విశ్వాసాని మ‌రో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ట ప్రియాంక‌.

బాలయ్యతో సన్నీ...?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందవ చిత్రం చిత్రీకరణకు సంబంధించి బిజీగా ఉన్నాడు.