రూట్ మారుస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌..?

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మెగాభిమానుల‌ను మెప్పిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌. ఒక ప‌క్క హీరోగా అగ్ర క‌థానాయ‌కుడిగా రాణించ‌డ‌మే కాకుండా మ‌రో ప‌క్క నిర్మాత‌గా కూడా మారారు. అయితే మ‌రో హీరోల‌తో సినిమాలు చేయ‌కుండా కేవ‌లం తండ్రితోనే వ‌రుస సినిమాలు చేస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి రీ ఎంట్రీ త‌ర్వాత చేసిన ‘ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రాల‌ను చెర్రీ నిర్మించాడు. ఇప్పుడు చిరు 152వ చిత్రానికి కూడా చ‌ర‌ణ్ నిర్మాత‌ల్లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూట్ మార్చుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ ట్రెండ్ ఏంటో తెలుసా? డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టాల‌నుకోవ‌డం. వెండితెర‌కు ధీటుగా డిజిట‌ల్ రంగం అభివృద్ధి జ‌రుగుతుంది. ప‌లువురు స్టార్స్ వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తుంటే, టాలీవుడ్ నిర్మాత‌లు కంటెంట్‌ను సిద్ధం చేసి సేల్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నిర్మాత అయిన చెర్రీ ఇత‌ర నిర్మాత‌ల్లాగానే వెబ్ సిరీస్‌ను నిర్మించాల‌నుకుంటున్నాడ‌ట‌. భారీ వెబ్ సిరీస్‌ను నిర్మించాల‌నేదే చ‌ర‌ణ్ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంది. ఇటీవ‌ల కాన్సెప్ట్ న‌చ్చితే చిరంజీవి తాను డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రి చ‌ర‌ణ్ చేయ‌బోయే వెబ్ సిరీస్‌లో చిరంజీవి హీరోగా న‌టిస్తారేమో చూడాలి.