సుకుమార్ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్ తో చేస్తున్నారు. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం 1980 - 1990 మ‌ధ్య జ‌రిగే గ్రామీణ ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నుంది. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ హియ‌రింగ్ ప్రాబ్ల‌మ్ ఉన్న యువ‌కుడుగా న‌టిస్తున్నాడు అని స‌మాచారం.

ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం ఒక ర‌కంగా చ‌ర‌ణ్ కి ఛాలెంజే. ఈ మూవీలో చ‌ర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించిన‌ట్టుగా కాకుండా గెడ్డంతో ఫుల్ ర‌గ్గ‌డ్ లుక్ లో క‌నిపిస్తాడ‌ట‌. కొన్ని సీన్స్ ను ఈస్ట్ గోదావ‌రిలో చిత్రీక‌రించిన త‌ర్వాత హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా రూపొందిస్తున్న సెట్ లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి త‌ర్వాత ప్రారంభించ‌నున్నారు. మ‌రి... చ‌ర‌ణ్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ తో ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

More News

హారిక & హాసిని బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ప్ర‌య‌త్నం చేసారు. అయితే...అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌ర్ స్టార్ తో మూవీ క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు కానీ.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' గ్రాండ్ 30 రోజుల వేడుక

వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం

కన్ ఫర్మ్ అయినట్టే....

శర్వానంద్ శతమానం భవతి సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయిపోగానే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.

బెల్ గ్రేడ్ లో 'డ్యూయెట్'....

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ,అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్

కొత్త టెక్నాల‌జీతో అమ్మ‌డు సాంగ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఖైదీ నెం 150 చిత్రం భారీ స్ధాయిలో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. చిరు, కాజ‌ల్ పై చిత్రీక‌రించిన అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.