ఛాలెంజ్‌లో పాల్గొన్న చరణ్ ఏమన్నాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియల్ మేన్’. కరోనా దెబ్బకు దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలందరూ డిఫరెంట్ ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. అయితే సందీప్ వంగా మాత్రం ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేయాలంటూ ఈ ఛాలెంజ్‌ను స్టార్ట్ చేశారు. ముందు రాజమౌళికి సందీప్ ఛాలెజ్ విసిరారు రాజమౌళి. తారక్, చరణ్‌లతో పాటు శోభు యార్లగడ్డ, కీరవాణి, సుకుమార్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఇందులో తారక్ ముందుగా ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. అలాగే చరణ్ కూడా ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.
రామ్‌చరణ్ వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతకడంతో పాటు ఇల్లు తుడవడం పనులు చేయడమే కాకుండా శ్రీమతి ఉపాసనకు కాఫీ కూడా పెట్టించాడు. ‘‘రాజమౌళిగారు ఛాలెంజ్ పూర్తి చేశాను. ఇంటి పనుల్లో భాగం కావడం గర్వంగా ఉంది. మహిళలకు ఇంటి పనుల్లో సాయం చేసి నిజమైన మగాడిగా నిలబడండి. త్రివిక్రమ్‌గారు, రణ్వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్‌లను ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను’’ అని మెసేజ్ కూడా పోస్ట్ చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.
Done @ssrajamouli garu !!
— Ram Charan (@AlwaysRamCharan) April 21, 2020
Let's take pride in doing chores at home! Let's be real men and help the women by sharing the work load.#BetheREALMAN
I further nominate Trivikram garu, @RanveerOfficial, @RanaDaggubati and @ImSharwanand to take up the challenge. pic.twitter.com/ItQ0zNQOR8
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments