చరణ్ సినిమా సెన్సార్ డేట్...

  • IndiaGlitz, [Monday,September 28 2015]

'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం బ్రూస్‌లీ ద ఫైటర్. ప్రస్తుతం హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాని అక్టోబర్ 16న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆడియో అక్టోబర్ 2న విడుదలకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 12న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుందట. ప్రస్తుతం సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుపుకుంటుంది.