చరణ్, బోయపాటి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్
- IndiaGlitz, [Thursday,June 07 2018]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణమే నటిస్తోంది. 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, తమిళ నటుడు ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, అనన్య తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. కాగా.. తాజా షెడ్యూల్ జూన్ 11న ప్రారంభం కానుందని.. నెలాఖరువరకు జరిగే ఈ షెడ్యూల్ను నానక్రామ్గూడతో పాటు హైదరాబాద్లోని పలు ప్రదేశాల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జగదేక వీరుడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ వస్తుంది.