చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Thursday,June 07 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మాస్ మ‌సాలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగ‌ణ‌మే న‌టిస్తోంది. 'భ‌ర‌త్ అనే నేను' ఫేమ్‌ కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్‌, త‌మిళ న‌టుడు ప్ర‌శాంత్, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్‌, అన‌న్య త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు చేస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. కాగా.. తాజా షెడ్యూల్ జూన్ 11న ప్రారంభం కానుంద‌ని.. నెలాఖ‌రువ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌ను నానక్‌రామ్‌గూడతో పాటు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జ‌గ‌దేక వీరుడు’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే టైటిల్ పై క్లారిటీ వ‌స్తుంది.

More News

ఆక‌ట్టుకుంటున్న బ‌న్ని మెసేజ్‌...

ఒక‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, బ‌న్ని ఫ్యాన్స్‌కు అస‌లు ప‌డేది కాదు. దాంతో బ‌న్ని సినిమాలకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి.

శ్రీకిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో చైనీస్ చిత్రం 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్'

స‌శేషం, భూ, దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ ఇప్పుడు 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్‌' అనే చైనీస్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

స‌వ్య‌సాచి.. భూమిక పాత్ర కోసం రెండు వెర్ష‌న్లు

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో

సిక్స్ ప్యాక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఫైట్ సీక్వెన్స్‌

రంగ‌స్థ‌లం ఘ‌న‌విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది.

త‌మ‌న్నాకి మ‌ళ్ళీ క‌లిసొస్తాయా?

తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ నాయిక‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది త‌మ‌న్నా.