Ram Charan:డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరోల్లో చరణ్ టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా చరణ్ అభిమానుల బృందం ప్లానో(డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు. వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు. అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్ర తారగా దూసుకెళ్తున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com