రామ్ చరణ్ దే పైచేయి...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కామెడి, యాక్షన్ ఎంటర్ గా రూపొందుతోన్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.
విడుదలకు ముందే సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉండటంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీటీవీ వారు 13 కోట్ల రూపాయలను చెల్లించి చేజిక్కించుకున్నారట. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ హక్కులను ఈ మొత్తంలో జీటీవీ వారు సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మహేష్ శ్రీమంతుడు శాటిలైట్ హక్కులను 12 కోట్లకు చేజిక్కించుకున్న జీటీవీ వారు రామ్ చరణ్ కి 13కోట్లు చెల్లించడం విశేషం. మొత్తం మీద ఈ విషయంలో రామ్ చరణ్, మహేష్ కంటే ఓ మెట్టు పైనున్నాడు. మరి రేపు సినిమా రిలీజ్ అయితే రికార్డులు విషయంలో పోటీ ఎలా ఉంటాయో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com