"ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బ‌డిన‌ట్టుంట‌ది.." గూజ్ బమ్స్ రేపుతున్న రామ‌చర‌ణ్ బ‌ర్త్‌డే ట్రీట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీబ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ ప్రొడ్యూస‌ర్ డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌..మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. రెండు చారిత్రాత్మ‌క పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న కల్పిత‌గాథే ఈ చిత్రం.

ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నిప్పు అంత శ‌క్తివంతంగా ఉండేలా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను.. నీరు వంటి ప‌వ‌ర్‌పుల్‌గా ఉండేలా ఎన్టీఆర్ పాత్ర‌ను రాజ‌మౌళి డిజైన్ చేశారు.

మార్చి 27న మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా కొమురంభీమ్ పాత్ర‌లో న‌టించిన ఎన్టీఆర్.. అల్లూరి సీతారామారాజు పాత్ర‌లో న‌టించిన రామ్‌చ‌ర‌ణ్‌కు పుట్టిన‌రోజు గిఫ్ట్‌ను ఇస్తాన‌ని అన్నారు. అన్నట్లుగానే రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన తార‌క్ ‘‘నేను ప్రామిస్ చేసినట్లు అల్లూరి సీతారామ‌రాజుని అందిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే బ్రదర్. మన బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అనే మెసేజ్‌తో పాటు భీమ్ ఫ‌ర్ రామ‌రాజు అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేశారు తార‌క్‌.

ఈ ట్వీట్‌కు రామ్‌చ‌రణ్ స్పందిస్తూ ‘‘నా సోదరుడు తారక్, డైరెక్టర్ రాజమౌళి, ఎంటైర్ చిత్ర యూనిట్‌కి పెద్ద కృత‌జ్ఞ‌త‌లు. నాకు, నా అభిమానుల‌కు మ‌ర‌చిపోలేని చ‌క్క‌నైన, ప్ర‌త్యేక‌మైన వీడియోను అందించారు. ఈ వీడియో మీ అందరికీ న‌చ్చుతుంది. ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

బ్రిటీష్ వారి ఆధిప‌త్యాన్ని ఎదిరించిన మ‌న్నెం దొర అల్లూరి సీతారామరాజు గొప్ప‌తనాన్ని కొమురం భీమ్ వివ‌రిస్తున్న‌ట్లు వీడియో ఉంది. వీడియోలో రామ్‌చ‌ర‌ణ్ సిక్స్ ప్యాక్‌లో క‌న‌ప‌డుతూ వ్యాయామం చేయ‌డం, కర్ర‌సాము చేయ‌డం, విల్లు సంధించ‌డం, తుపాకీ కాల్చ‌డం వంటి సీన్స్‌తో పాటు

‘‘ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బ‌డిన‌ట్టుంట‌ది..
క‌ల‌వ‌డితే ఏగుసుక్క ఎగ‌వ‌డిన‌ట్టుంట‌ది…
ఎదురుబ‌డితే సావుకైనా సెమ‌ట ధార‌క‌డ‌త‌ది
బాణ‌మైనా బంధూకైనా వానికి బాంచ‌నైత‌ది
ఇంటి పేరు అల్లూరి... సాకింది గోదారి
నా అన్న‌... మ‌న్నెం దొర‌... అల్లూరి సీతారామ‌రాజు…’’

అంటూ తారక్ వాయిస్ ఓవర్‌లో చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అంచ‌నాల‌ను ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎలివేట్ చేసేలా ఉన్న ఈ వీడియోను తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌గా తార‌క్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం విశేషం.

డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌లవుతుంది.

More News

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు

ప‌వ‌న్‌, కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంత‌కూ వీరిద్ద‌రీ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏంటి? ఎందుకు జ‌రిగింది?

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పరీక్షలు లేకుండానే పై తరగతికి!

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్

కరోనాపై యుద్ధానికి యంగ్ టైగర్ 75 లక్షల విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు

మ‌హేశ్ 27లో మ‌హాన‌టి..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది.