రాజమండ్రిలో రామ్‌చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తదుపరి ఫారెస్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. దీని కోసం ఆచార్య యూనిట్ .. రాజమండ్రి అటవీ ప్రాంతం మారేడుమిల్లిలో చిత్రీకరించబోతున్నారు. అది కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ‘ఆచార్య’ కొత్త షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్ రాజమండ్రి చేరుకునేశారు. ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే నక్సలైట్ నాయకుడు పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్రకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరించనున్నారు.
పుష్ప షూటింగ్ సమయంలో ఓ స్పెషల్ గెస్ట్ హౌస్‌ను నిర్మించారట సుకుమార్ అండ్ టీమ్. ‘ఆచార్య’ యూనిట్ కూడా అక్కడే బస చేస్తారని అంటున్నారు. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డేలపై సన్నివేశాలను చిత్రీకరిస్తారట. దేవాదాయ శాఖలోని అవినీతిని ప్రశ్నించేలా ‘ఆచార్య’ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సోనూసూద్ విలన్‌గా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com