మరోసారి పోలీస్ పాత్ర‌లో...

  • IndiaGlitz, [Friday,August 17 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం త‌దుప‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌.

ఇంత‌కు ముందు తుఫాన్ చిత్రంలో చ‌ర‌ణ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. మ‌రోసారి చ‌ర‌ణ్ పోలీస్‌గా మెప్పించ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వ‌తున్నారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లోనే ప్లాన్ చేశారు.

ఈ నెల 15 నుండి ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, స్నేహ‌, అర్య‌న్ రాజేశ్‌, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.