ప్రిన్స్‌గా రామ్‌చరణ్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్లాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'రంగస్థలం'. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, చరణ్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ని రాజస్తాన్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీలో చెర్రీ రాజవంశీకుడిగా కనిపించబోతున్నారని సమాచారం. అందుకోసమే రాజస్తాన్‌లో గల రాజమహల్లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. దాదాపు 30 శాతం సినిమాని ఈ మహల్ లోనే షూట్ చేయబోతున్నారట.
అంటే చెర్రీ కొంత సేపు యువరాజుగా ప్రేక్షకులను అలరించబోతున్నారన్న మాట. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా 'రాజా విక్రమార్క' సినిమాలో యువరాజుగా సందడి చేసిన సంగతి తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com