ఖైదీ నెం150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన చరణ్..!

  • IndiaGlitz, [Tuesday,January 03 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150 చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై నిర్మించారు. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ను రామ్ చ‌ర‌ణ్ ఎనౌన్స్ చేసారు. ఈనెల 11న ఖైదీ నెం 150 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
ఈనెల 12న బాల‌కృష్ణ గారి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు. ఖైదీ నెం 150 చిత్రాన్ని 12న రిలీజ్ చేయాలి అనుకున్నాం. అయితే....ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు. అందుచేత మేము 11 తారీఖున ఖైదీ నెం 150 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఇక ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఈనెల 4న విజ‌య‌వాడ‌లో చేయాలి అనుకున్నాం. అయితే...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈనెల 7న విజ‌య‌వాడ హైవే ద‌గ్గ‌ర‌లోని హ‌య్ లాండ్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంద‌రూ అన్న‌య్య‌ను మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి ఆహ్వానించ‌డానికి ఫంక్ష‌న్ కి రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

More News

జనవరి 6 న విడుదల కానున్న 'ఏ రోజైతే చూశానో'

స్మితికాచార్య ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ మనోజ్నందన్ జంటగా బాల.జి దర్శకత్వంలో ఆర్.యస్.క్రియోషన్స్ అండ్ శ్రీ శివపార్వతి కంబైన్స్ బ్యానర్ లో తన్నీరు సింహద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపోందిస్తున్న రోమాంటిక్ లవ్ స్టోరి ఏ రోజైతే చూశానో..

నా క‌ల నెర‌వేర‌డం మాటల్లో చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది - రైట‌ర్ సాయిమాధ‌వ్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న'నేత్ర'!

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్లైన్.

సావిత్రిగా నటించేది సమంత కాదు..నాని హీరోయిన్..!

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు నాగ అశ్విన్.

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే - పవన్ కళ్యాణ్..!

కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.