చిత్తూరు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ ఘటనపై మెగా హీరోలు ఒక్కొక్కరుగా స్పందింస్తున్నారు. మృతుల కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకకు సన్నాహాలు చేస్తూ సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు జనసైనికులు మృతి చెందారు. ఇప్పటికే వీరి మృతిపై మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్పందించారు. ‘‘కోల్పోయిన జీవితాలను అయితే తిరిగి తీసుకురాలేము. ఇంతటి బాధాకరమైన సిట్యువేషన్లో ఆ కుటుంబానికి అండగా నిలవడం మాత్రమే చేయగలం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా’’ అని చెర్రీ ట్వీట్ చేశాడు.
అల్లు అర్జున్ కూడా ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో పవన్ కల్యాణ్ గారి అభిమానులు మృతి చెందారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలవాలనుకుంటున్నా. అభిమానులందరికీ, ప్రజలకు వారు కొనసాగిస్తున్న ప్రేమకు, మద్దతుకు అభినందనలు తెలియజేస్తున్నా’’ అని బన్నీ పేర్కొన్నాడు.
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com