చ‌ర‌ణ్‌, నాని కాంబినేష‌న్లో మూవీ..?

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

చ‌ర‌ణ్‌, నాని కాంబినేష‌న్లో మూవీ...అన‌గానే వీరిద్ద‌రు క‌ల‌సి న‌టిస్తున్నార‌నుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే...రామ్ చ‌ర‌ణ్‌...చిరు 150వ సినిమాతో నిర్మాత‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, వైట్ హార్స్ అనే రెండు నిర్మాణ సంస్థ‌లు ప్రారంభించి వ‌రుస‌గా సినిమాలు నిర్మించ‌డానికి చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ లో బిగ్ బ‌డ్జెట్ మూవీస్...వైట్ హార్స్ బ్యాన‌ర్ లో చిన్న బ‌డ్జెట్ సినిమాలు తీయాల‌నుకుంటున్నారు. అందులో భాగంగానే చ‌ర‌ణ్..నానితో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. నానితో సినిమా త‌ర్వాత శ‌ర్వానంద్ తో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాల‌కు సంబంధించి ఎనౌన్స్ మెంట్ చేయ‌నున్నార‌ట చ‌ర‌ణ్‌.