జూన్ 3న కేటీయార్-రామ్ చరణ్ లు విడుదల చేయనున్న 'కాదలి' ఆడియో

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న "కాదలి" ఇప్పటికే రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల విశేషమైన క్రేజ్ ను సంపాదించుకొంది. ఆ క్రేజ్ ను రెట్టింపు చేస్తూ.. "కాదలి" చిత్రం ఆడియోను జూన్ 3న తెలంగాణ ఐ.టి శాఖ మంత్రివర్యులు కేటీయార్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి విడుదల చేయనున్నారు. అనగనగా సినిమా పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పట్టాభి ఆర్.చిలుకూరి మాట్లాడుతూ.. "మా "కాదలి" టైటిల్ కు విశేషమైన స్పందన వచ్చింది. మినిష్టర్ కేటీయార్ గారు మా టైటిల్ లోగోను విడుదల చేసినందుకే చాలా సంతోషించాం. ఇప్పుడు ఆయన మా ఆడియో వేడుకకు కూడా విచ్చేయనుండడం పట్టరాని ఆనందాన్ని కలిగిస్తోంది. కేటీయార్ గారితోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు. మా చిన్న చిత్రానికి ఇంతటి భారీ పబ్లిసిటీ లభిస్తుండడం, స్టార్ హీరోహీరోయిన్లతోపాటు మా కీటీయార్ గారు కూడా సపోర్ట్ చేస్తుండడం వల్ల "కాదలి" ఇప్పటికే కొన్ని లక్షల మంది జనాలకి రీచ్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.