శంకర్ - చరణ్ మూవీ: నిన్నటి వరకు యాక్షన్ సీక్వెన్స్‌లు.. కొంచెం లవ్ టచ్ వుండాలిగా..!!!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ దర్శక దిగ్గజం శంకర్ సినిమా వస్తుందంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. పాటలు, ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు భారీగా వుంటాయి. ఔట్‌పుట్ బాగా రావాలి తప్ప బడ్జెట్ ఎంత అనేది ఆయనతో పనిచేసే నిర్మాతలు పట్టించుకోరు. జెంటిల్మెన్ నుంచి నిన్నటి రోబో 2.0 వరకు శంకర్ స్ట్రాటజీ ఇదే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్న సినిమా కోసం కూడా పక్కా ప్రణాళిక రెడీ చేశారట శంకర్.
ఇప్పటికే రామ్‌చరణ్ అండ్ టీంపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు శంకర్. అందులో ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం హైలెట్‌గా ఉండనుందని సమాచారం. 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఏ సినిమాలో చూడని రేంజ్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని ఫిలింనగర్ టాక్.
ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందట. ఇప్పటికే హీరోయిన్ కియారా నగరానికి చేరుకున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు శంకర్ ప్లాన్ చేశారని టాలీవుడ్ టాక్. సునీల్, జయరాం, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాలు సమకూర్చనున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారని టాక్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో రాజీపడేది లేదని దిల్ రాజు కూడా ఫిక్సయ్యారట
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com