Ram Charan:జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం.. చరణ్ పెట్ డాగ్‌ని చూశారా, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
మానవ నాగరికత ప్రారంభమైన నాటి నుంచి మనిషి జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగం. మానవుడు అనేక జంతువులను మచ్చిక చేసుకుని నిత్యజీవితంలో వాటిని భాగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11ని ‘‘ జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం’’గా జరుపుకుంటున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు వారి ఇళ్లలో కుక్కలని, పిల్లులని లేక మరేదైనా జంతువుని ప్రేమగా పెంచుకుంటున్నారు. కొందరికి అవి ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ. వాటికి ఏం జరిగినా తట్టుకోలేరు.
కన్నబిడ్డలా సాకుతోన్న చరణ్-ఉపాసన:
ఇక టాలీవుడ్ స్టార్ హీరోల్లో జంతువులను ఇష్టపడే వారిలో రామ్ చరణ్ ముందువరుసలో వుంటారు. ఆయన సతీమణి ఉపాసనకు కూడా మూగజీవాలంటే ఎంతో మక్కువ. వీరిద్దరూ కలిసి ‘‘రైమ్’’ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. పూడిల్ జాతికి చెందిన ఈ కుక్కకి ఒంటి నిండా పట్టులాంటి వెంట్రుకలు వుంటాయి. చూడగానే ముద్దొచ్చేలా కనిపించడమే దీని ప్రత్యేకత. అందుకే చరణ్, ఉపాసనలకు ఇదంటే పంచ ప్రాణాలు. లోకల్‌లో వున్నా.. ఫారిన్ షూటింగ్ వున్నా రామ్ చరణ్‌తో పాటే ఇది వెళ్తుంది. చెర్రీలో ఒళ్లోనే పెరిగిన రైమ్ ఫోటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అంతేకాదు.. రైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను కూడా తెరిచారు చరణ్-ఉపాసన. దీనికి 58 వేల మందికి పైగా ఫాలోవర్లు వున్నారు. ఈ రోజు పెంపుడు జంతువుల దినోత్సవం కావడంతో రైమ్‌తో చెర్రీ వున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దుబాయ్‌లో సీమంతం జరుపుకున్న ఉపాసన:
ఇకపోతే.. పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉపాసన తాను గర్భందాల్చినట్లు ప్రకటించి మెగా కుటుంబాన్ని, అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రెగ్నెన్సీ సమయంలోనే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ జంట మరింత జోష్‌లో వుంది. ఈ నేపథ్యంలో ఉపాసనకు ఆమె పుట్టింటివాళ్లు దుబాయ్‌లో సీమంత వేడుక నిర్వహించారు. ఉపాసన సిస్టర్స్ అనుష్పాల, సింధూరిలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ పండుగలా సాగింది. పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకున్న అనంతరం చరణ్, ఉపాసనలు దుబాయ్ బీచ్‌లో చక్కర్లు కొట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com