మరో తమిళ మూవీ రైట్స్ తీసుకున్న చరణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ చిత్రం తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చరణ్ మరో తమిళ మూవీ 49 - ఓ రీమేక్ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో గౌండమణి హీరోగా నటించారు. చాలా గ్యాప్ తరువాత ఆయన రైతుల సమస్యలపై ఈ మూవీ చేసారు. గౌతమ్ మీనన్ శిష్యుడు పి.ఆరోగ్యదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. గౌండమణి కోసం...ఈ చిత్ర కథ కోసం సినిమా చూడాల్సిందే అంటుంది తమిళ మీడియా.
దీంతో రామ్ చరణ్ ఇటీవల ఈ మూవీ చూసి రీమేక్ రైట్స్ తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. కత్తి రీమేక్ రైట్స్ తీసుకున్న చరణ్ 49 - ఓ రీమేక్ రైట్స్ కూడా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రొడక్షన్ హూస్ ప్రారంభించనున్న చరణ్ వేరే హీరోలతో నిర్మించేందుకే ఈ మూవీ రైట్స్ తీసుకున్నారని కొందరు అంటుంటే...కత్తిలో మార్పులు చేయడం కోసం తీసుకున్నారని మరి కొందరి వాదన...ఏది ఏమైనా ఈ మూవీ ఎవరితో చేస్తారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments