మ‌రో రీమేక్ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Monday,February 17 2020]

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఒక ప‌క్క హీరోగా న‌టిస్తూనే సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం చిరంజీవి 152వ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హరిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. మల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవితోనే నిర్మించాల‌నుకుంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. కాగా.. తాజా స‌మాచారం మేరకు చ‌ర‌ణ్ మ‌రో మ‌ల‌యాళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడ‌ట‌. ఆ చిత్ర‌మేదో కాదు.. 'డ్రైవింగ్ లైసెన్స్‌'.

మ‌రి రామ్‌చ‌ర‌ణ్ ఈ మ‌ల‌యాళ సినిమాను ఏ హీరోతో చేస్తాడ‌నే ఆస‌క్తిగా మారింది. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మెగా హీరోల్లో ఎవ‌రో ఒక‌రితో చ‌ర‌ణ్ ఈ సినిమా చేస్తాడ‌ని టాక్‌. ఈ ఏడాది చివ‌ర‌లో కానీ.. లేదా వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో కానీ ఈ సినిమాను చ‌ర‌ణ్ రీమేక్ చేస్తాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్ హీరోగా.. త‌దుపరి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

More News

‘సోది ఆపి.. దమ్ముంటే నన్ను ఆపు’ (‘V’ టీజర్ రివ్యూ)

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘V’ చిత్రం. ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదలింది.

రామానాయుడుస్టూడియో క‌నుమ‌రుగ‌వనుందా?

మూవీ మొఘ‌ల్‌.. డా.డి.రామానాయుడు, తెలుగు చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని పేరు. శ‌తాధిక చిత్ర నిర్మాతే కాదు.

ఫిబ్రవరి 28న ధనుష్ 'లోకల్ బాయ్'

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతం అందించిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.