నేను శైల‌జ లో రామ్ క్యారెక్ట‌ర్ ఇదే..

  • IndiaGlitz, [Monday,November 30 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఓ పాట‌ను ఇటీవ‌ల గోవాలో షూట్ చేసారు.ఈ మూవీకి ముందుగా హ‌రిక‌థ అనే టైటిల్ అనుకున్నారు. కానీ నేను శైల‌జ టైటిల్ అయితే బాగుంటుంద‌ని ప‌రిశీలిస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ టైటిల్ ను ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో రామ్ నైట్ ప‌బ్ లో వ‌ర్క్ చేసే డిజె పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. రామ్ పాత్ర చాలా ఇంట్ర‌స్టింగ్ గా రియ‌లిస్టిక్ గా ఉంటుంద‌ట‌. రామ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్ననేను శైల‌జ ఆడియోను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఈ మూవీని జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి..శివ‌మ్ తో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన రామ్ నేను శైల‌జ తో అయినా విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.

More News

'అ..ఆ..'తో బ్రేక్ అవుతుందా?

'ఇష్క్','గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.అయితే..ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్ కి ఏ మాత్రం అచ్చి రాలేదు.

మెగా హీరో తో ఫీల్ మై ల‌వ్..

దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌నే ఇంట్ర‌స్ట్ అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది.

దేవిశ్రీ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్ వ‌చ్చాడు. ఇంత‌కీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్ర‌సాదే మ్యూజిక్ అందించాడు.

అంతా ఓకె అంటున్న హన్సిక...

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.ఆతర్వాత ఎన్టీఆర్,రామ్,విష్ణు,సిద్దార్థ..ఇలా యంగ్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2మూవీ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.