Skanda:రామ్ 'స్కంద' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే..?

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కలయికలో ఇటీవల విడుదలైన 'స్కంద'(Skanda) పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన తొలి రోజే రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బోయపాటి మార్క్ యాక్షన్, రామ్ ఎనర్జీటిక్ యాక్టింగ్‌ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటం, కథలో లాజిక్ మిస్ అవ్వడంతో క్లాస్ ఏరియాల్లో మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే బీ, సీ సెంటర్లలో మాత్రం బాగానే ఆకట్టుకుంది. మొదటిసారి ఊర మాస్ లుక్‌తో పాటు డ్యూయల్ రోల్‌లో రామ్ అదరగొట్టాడు.

అక్టోబర్ 27 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..

బాక్సాఫీస్ వద్ద మిడియం హిట్‌గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ(OTT)లో అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar) అక్టోబర్ 27వ తేదీన 'స్కంద'(Skanda) మూవీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 27 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

పూరి-రామ్ కలయికలో 'డబుల్ ఇస్మార్ట్'..

ఇక ఈ మూవీలో రామ్ పోతినేని సరసన శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్(Saiee Manjrekar) ప్రధాన పాత్రలో కనిపించింది. సీనియర్ హీరో శ్రీకాంత్(Srikanth), ప్రిన్స్(Prince), దగ్గుబాటి రాజా, గౌతమి(Gowthami), ఇంద్రజ(Indraja), పృధ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జి స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే రామ్ ప్రస్తుతం డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannath) దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్'(Double ismart) సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'(Ismart shankar)కి ఇది సీక్వెల్‌గా తెరెకెక్కుతుంది.

More News

Nara Lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు హైకోర్టులో భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసు క్లోజ్

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

CM Jagan:పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబు, బాలయ్యపైనా సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) పెళ్లిళ్లపై సీఎం జగన్(CM Jagan) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Taj Mahal Tea:వాన పడితే సంగీతం .. ‘‘వాజ్ తాజ్’’ బిల్‌ బోర్డ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు

ఏ కంపెనీకైనా, ఉత్పత్తికైనా వినియోగదారులను ఆకర్షించడం అనేది కీలకం. ఇందుకోసం కొత్త కొత్త ‘పబ్లిసిటీ’ మార్గాలను అన్వేషిస్తాయి సంస్థలు.

CM Jagan:విజయదశమి రోజున విశాఖకు షిఫ్ట్ కానున్న సీఎం జగన్.. ముగ్గురు సభ్యులతో కమిటీ

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nagababu:బిగెస్ట్ డెవిల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.. కలిసి పోరాడి వైసీపీని గద్దె దించుద్దాం: నాగబాబు

బిగెస్ట్ డెవిల్స్‌తో మనం యుద్ధం చేస్తు్న్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తెలిపారు.