close
Choose your channels

రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' టైటిల్ ఖరారు

Saturday, August 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం 'నేను శైలజ'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. 'స్రవంతి' రవికిశోర్, పి.ఆర్‌. సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కష్ణచైతన్య నిర్మిస్తున్నారు.

ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ లో 50 శాతం పైగా సినిమా పూర్తయింది. ఈ నెల 7న ఊటీలో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ - ``స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఉన్న 'ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు...' అనే పాటకు సంబంధించిన 'లిరికల్ వీడియో'ను విడుదల చేయబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ అన్ని పాటలకూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెల ఇటలీలో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

శ్రీవిష్ణు, పెళ్లి చూపులు` ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment