రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' టైటిల్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం 'నేను శైలజ'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. 'స్రవంతి' రవికిశోర్, పి.ఆర్. సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కష్ణచైతన్య నిర్మిస్తున్నారు.
ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ లో 50 శాతం పైగా సినిమా పూర్తయింది. ఈ నెల 7న ఊటీలో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ - ``స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఉన్న 'ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు...' అనే పాటకు సంబంధించిన 'లిరికల్ వీడియో'ను విడుదల చేయబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ అన్ని పాటలకూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెల ఇటలీలో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
శ్రీవిష్ణు, పెళ్లి చూపులు` ఫేమ్ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout