సరిగ్గా ఏడాదికి..రామ్ దర్శనం..
- IndiaGlitz, [Wednesday,August 09 2017]
నేను శైలజతో గతేడాది ఆరంభంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు రామ్. ఆ తరువాత వచ్చిన హైపర్ మాత్రం నిరాశపరిచింది. మళ్లీ ఎలాగైనా సక్సెస్‌ని సొంతం చేసుకోవాలన్న కసితో.. మరోసారి నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు రామ్.
ఆ చిత్రమే ఉన్నది ఒక్కటే జిందగీ. సగానికి పైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే.. రామ్ గత చిత్రం హైపర్ తరువాత సరిగ్గా ఏడాదికి అతని దర్శనం అభిమానులకు లభిస్తోందన్నమాటే. హైపర్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలయ్యింది. ఆ రోజుకు ఒక్క రోజు ముందు అంటే.. సరిగ్గా ఏడాదికి అతని కొత్త చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ రానుందన్నమాట. హైపర్తో మిస్సయిన సక్సెన్ని ఉన్నది ఒక్కటే జిందగీతో రామ్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం.