సాలిడ్ హిట్ కోసం రెచ్చిపోయిన రకుల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సాలిడ్ హిట్ కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే తన అప్‌కమింగ్ ఫిల్మ్ 'బ్రూస్లీ' కోసం మాగ్జిమమ్ స్కిన్ షో చేసి.. యూత్‌ని థియేటర్లవైపు పరుగులు పెట్టించేందుకు తన వంతుగా ట్రై చేసిందని టాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. తన టాలీవుడ్ కెరీర్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'లౌక్యం' వంటి విజయాలు దక్కినా.. అవి రకుల్ స్టార్ హీరోయిన్ ఎదిగేందుకు మెట్లుగా ఉపయోగపడ్డాయే కానీ.. స్టార్ హీరోయిన్ని అయితే చేయలేదు.
ఆ తరువాత 'కిక్ 2' వంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించినా.. రిజల్ట్ నెగెటివ్ అని తేలడంతో.. రకుల్ తన లేటెస్ట్ మూవీ 'బ్రూస్లీ'లో గ్లామర్ పరంగా తమన్నా రేంజ్లో రెచ్చిపోయింది. 'లౌక్యం' తరువాత సరైన విజయం లేని రకుల్ కి 'బ్రూస్లీ' కోసం చేసిన గ్లామరస్ హార్డ్‌వర్క్..ఆమె పక్కా 'స్టార్ హీరోయిన్ మెటీరియల్' అని తెలపడానికి ఏ మాత్రం సాలిడ్ హిట్‌కి దారి తీస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com