ఇంట్లో చెప్ప‌నంటున్న ర‌కుల్‌

  • IndiaGlitz, [Sunday,February 03 2019]

సినిమాలంటే ప్యాష‌న్‌లో పాటు పిట్‌నెస్ అంటే కేర్ ఉండే హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. రీసెంట్‌గా ఈమె త‌న ఫ్యాన్ చేసిన కామెంట్స్‌కు ఘాటైన బ‌దులిచ్చి వార్త‌ల్లో నిలిచింది. సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్స్ చేస్తుంటారు.

వాటిని నేను ప‌ట్టించుకోను. కానీ ఈసారి ప‌ట్టించుకోవాల్సి వ‌చ్చిందంటున్న ర‌కుల్‌.. త‌న స‌మ‌స్య‌ల‌ను ఫ్యామిలీకి చెప్పి వారిని టెన్ష‌న్ పెట్ట‌ద‌ట‌. త‌నే ప‌రిష్క‌రించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌.

సినిమా ప్లాప్ అయినా కూడా ఓరోజు బాధ‌ప‌డుతుంద‌ట‌. త‌ర్వాత రోజు నుండి ఏం చేయాల‌నేది ఆలోచిస్తూ ముందుకెళ‌తాన‌ని అంటుంది ర‌కుల్ ప్రీత్ సింగ్.