సూర్య, కార్తీతో ఒకే ఏడాదిలో..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు నాట సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే ద్విభాషా చిత్రం స్పైడర్ చిత్రంతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మరో ద్విభాషా చిత్రం ఖాకితో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ సందడి చేయనుంది.
ఖాకి సినిమా విడుదల కాక ముందే ఆ చిత్ర కథానాయకుడు కార్తీతో మరో సినిమా చేసేందుకు రకుల్ అంగీకరించింది. ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా.. కార్తీ సోదరుడు సూర్య నటించబోయే చిత్రంలోనూ రకుల్ నటించనుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. దీపావళి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
ఇక కార్తీతో నటించనున్న కొత్త చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. అంటే.. ఒకే సంవత్సరంలో అన్నదమ్ములైన సూర్య, కార్తీ చిత్రాలతో రకుల్ సందడి చేయనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com