ఎన్టీఆర్ తో మొదలుపెడుతున్న రకుల్

  • IndiaGlitz, [Saturday,October 17 2015]

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ ని ఆక‌ర్షిస్తున్నఅందం పేరిది. స్టార్ హీరోల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ.. జెట్ స్పీడ్‌తో తెలుగునాట దూసుకుపోతోంది ఈ అమ్మ‌డు. నిన్న‌టికి నిన్న 'బ్రూస్ లీ' కోసం రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న అల‌రించిన‌ ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో 'నాన్న‌కు ప్రేమ‌తో', అల్లు అర్జున్ స‌ర‌స‌న 'స‌రైనోడు' సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

వీటిలో 'నాన్న‌కు ప్రేమ‌తో' సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండ‌గా.. 'స‌రైనోడు' స‌మ్మ‌ర్‌లో సంద‌డి చేసే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటోంది. విశేష‌మేమిటంటే.. 'నాన్న‌కు ప్రేమ‌తో' తోనే ర‌కుల్ మొద‌టిసారిగా సంక్రాంతి సీజ‌న్‌లో వెండితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఎన్టీఆర్‌తోనే మొద‌లుపెడుతున్న ఈ అంకం.. ర‌కుల్‌ని ఏ మాత్రం సంక్రాంతి లక్ష్మీగా మారుస్తుందో చూడాలి.

More News

దసరా కానుకగా 'మరియన్'

ధనుష్ హీరోగా,పార్వతీ మీనన్ హీరోయిన్ గా భరత్ బాల దర్శకత్వంలో ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి.పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్ వి.రవిచంద్రన్ తమిళంలో నిర్మించిన ‘మరియన్’

దసరా కానుకగా ఈ నెల 22న రాబోతున్న 'ప్లేయర్'

ట్రిపుల్ ఎక్స్ సోప్ యాడ్ తో నటుడిగా పరిచయం అయిన పర్వీన్ రాజ్ ఇప్పుడు హీరోగా మారాడు.

డీ గ్లామర్డ్ రోల్ లో తెలుగమ్మాయి

పేరుకి తెలుగమ్మాయిలు అయినా..తెలుగులో కంటే తమిళంలోనే మంచి అవకాశాలను పొందుతూ దూసుకుపోతున్న వారి జాబితా ఈ మధ్య బాగానే ఉన్న సంగతి తెలిసిందే.

'బ్రహ్మోత్సవం' హిట్ సెంటిమెంట్

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మహేష్బాబుతో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న చిత్రం'బ్రహ్మోత్సవం'.

దసరా కానుకగా ప్రారంభం కానున్న'ఎవడో ఒకడు'

మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ‘ప్రేమం’ తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో 'ఎవడో ఒకడు' అనే చిత్రం రాబోతోంది.