అది నిజ‌మే కానీ..అది కాదు అంటున్నర‌కుల్..

  • IndiaGlitz, [Tuesday,June 07 2016]

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ధృవ చిత్రంలో న‌టిస్తుంది. అయితే..ఇటీవల ర‌కుల్ ప్రీత్ సింగ్ యు.ఎస్ లోని లోక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హించిన ఓ ఈవెంట్ కు వెళ్లింది. యు.ఎస్ టూర్ ముగించుకుని ర‌కుల్ ఇప్ప‌టికే తిరిగి ఇండియాకి రావాలి కానీ రాలేదు. కార‌ణం ఏమిటంటే...విమానం ఎక్కే హ‌డావిడిలో ప‌డిపోయింద‌ట‌. దీంతో ర‌కుల్ కాలికి గాయం అయ్యింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యం పై ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈరోజు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....నా కాలికి గాయం అయ్యింద‌ని వార్తలు రాసారు.గాయాలు అవ్వ‌డం అనేది నిజ‌మే అయితే మెడ‌కు, భుజానికి గాయాల‌య్యాయి. కాలికి కాదు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. రేప‌టి నుంచి ఎప్ప‌టిలానే వ‌ర్క్ లో ఉంటాను అని తెలియ‌చేసింది.