మరో చిత్రంలో రకుల్, సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
కాంబినేషన్లను సెట్ చేయడంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధహస్తులు. గతంలో వెంకటేష్, మహేష్ బాబులతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమాని చేసి తెలుగు ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందించారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఎవడు చేసి మెగాభిమానులను మురిపించారు.
ప్రస్తుతం నితిన్, శర్వానంద్ హీరోలుగా రాజు ఓ మల్టీస్టారర్ ఫిలింని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రామయ్యా వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్ సినిమాలని తెరకెక్కించారు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే...ఈ సినిమాలో కథానాయికలుగా క్రేజీ హీరోయిన్స్ సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయ్యారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశేషమేమిటంటే.. సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ ఈ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com