బాలీవుడ్ హీరోతో రకుల్...

  • IndiaGlitz, [Monday,January 08 2018]

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ఈ జ‌న‌వ‌రి 26న విడుద‌ల కాబోయ్యే 'అయ్యారి' సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో రెండు సినిమాల‌తో పాటు త్వ‌ర‌లోనే మ‌రో బాలీవుడ్ సినిమా చేయ‌బోతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలోనే.

ఆ స్టార్ హీరో వేరేవ‌రో కాదు..అక్ష‌య్ కుమార్‌. గ‌తంలో సౌత్‌ హీరోయిన్లు ఆసిన్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, శృతిహాసన్‌ లాంటి వారికి అక్ష‌య్ అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు ర‌కుల్‌తో కూడా జ‌త క‌ట్ట‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.