రకుల్ డోసు పెంచినట్టే..
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు మెండుగా ఉన్న కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగులో ఈమె కెరీర్ కాస్తంత నెమ్మదిగానే మొదలైనా.. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం' వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు తన దశ, దిశను మార్చేసాయి. గతేడాది అయితే.. 'నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ'అంటూ వరుస విజయాలనే అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ ఏడాదిలోనూ ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం రూపంలో ఓ సక్సెస్ఫుల్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. మహేష్‌తో జోడీ కట్టిన స్పైడర్, దానికంటే ముందు.. జయ జానకి నాయక చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలూ తనకు మంచి గుర్తింపు తీసుకువస్తాయన్న ఆశాభావంతో ఉంది రకుల్.
ఇదిలా ఉంటే.. సినిమాల సంఖ్య పరంగా రకుల్‌కి ఈ సంవత్సరం వెరీ స్పెషల్. తెలుగులో ఇప్పటి వరకు ఒకే ఏడాదిలో మహా అంటే.. మూడేసి సినిమాలతోనే పలకరిస్తూ వస్తున్న రకుల్.. ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు చిత్రాలతో సందడి చేస్తోంది మరి. ఇప్పటికే 'విన్నర్, రారండోయ్..' విడుదల కాగా, 'జయజానకి నాయక, స్పైడర్' రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మొత్తానికి రకుల్ సినిమాల డోసు పెంచినట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com