సచిన్ కోసం రిపోర్టర్ గా మారింది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియాకు పేరు తెచ్చిన ఆటగాళ్ళ జీవిత కథల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. మేరీకోమ్, బాగ్ మిల్కాభాగ్, దంగల్ ఇలా చాలా సినిమాలే రూపొంది ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అలాగే క్రికెట్ ఆటగాళ్ళు ధోని, అజహర్లపై కూడా సినిమాలు రూపొందాయి. ఇప్పుడు రూపొందిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌పై రూపొందిన చిత్రం `సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్`. జేమ్స్ ఎరిక్సినే దర్శకత్వంలో రవి భగత్ చంద్కా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సచిన్ టెండూల్కర్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా సచిన్ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిపోర్టర్‌గా మారింది. తనకు సచిన్ అంటే బోల్డంత అభిమానమంని, అయన్ను ఇంటర్వ్యూ చేయడం మరచిపోలేని విషయమని రకుల్ తెలియజేసింది. ఆటగాడుగా ఎన్నో రికార్డులతో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన సచిన్ జీవితకథపై సినిమా అంటే చాలా అంచనాలే నెలకొన్నాయి. మరి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com