లెక్క సరిపెడుతున్న రకుల్
Send us your feedback to audioarticles@vaarta.com
2011లో రిలీజైన 'కెరటం'తో ఎంట్రీ ఇచ్చినా.. రెండేళ్ల తరువాత వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తోనే హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా ఇచ్చిన విజయంతో.. రకుల్ కి మళ్లీ వెనక్కి చూడాల్సిన పరిస్థితి రాలేదు. కట్ చేస్తే.. 2014లో ఏకంగా మూడు తెలుగు చిత్రాలతో ఈ పొడగరి హల్‌చల్ చేసింది. గోపీచంద్‌తో 'లౌక్యం', మంచు మనోజ్‌తో 'కరెంట్ తీగ', ఆదితో 'రఫ్' చేసింది. వీటిలో 'లౌక్యం' కమర్షియల్‌గా మంచి రిజల్ట్‌ని సొంతం చేసుకుంది.
ఇక ఈ ఏడాదిలోనూ రకుల్ తెలుగు సినిమాల సంఖ్య మూడే. ఇప్పటికే రామ్‌తో 'పండగ చేస్కో', రవితేజతో 'కిక్ 2' లతో పలకరించిన రకుల్.. ఈ నెల 16న రామ్ చరణ్‌తో 'బ్రూస్‌లీ' అంటూ సందడి చేయబోతోంది. మొత్తమ్మీద 2014 మాదిరిగానే.. 2015లోనూ మూడేసి సినిమాలు చేసి బాగానే లెక్క సరిపెడుతోంది రకుల్. ఇదే లెక్కని 2016లోనూ కంటిన్యూ చేస్తుందో లేదంటే అంతకుమించిన సినిమాలతో వెండితెరని హుషారెక్కిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే 2016 కోసం ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', అల్లు అర్జున్ 'సరైనోడు' లను సెట్ చేసుకుంది రకుల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments