కండోమ్ కథలో బోల్డ్ గా.. హింట్స్ ఇస్తున్న రకుల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో పలువురు స్టార్స్ తో ఆడిపాడింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రకుల్ 'దే దే ప్యార్ దే' లాంటి చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేసి అక్కడ స్టేజ్ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం రకుల్ కి బాలీవుడ్ నుంచి మరికొన్ని ఆఫర్స్ వస్తున్నాయి.
ఇటీవల రకుల్ బాలీవుడ్ లో కండోమ్ నేపథ్యంలో సాగే ఓ చిత్రానికి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అంతా ఓకే అయింది కానీ మరి కొన్ని విషయాల్లో నిర్మాతలతో రకుల్ చర్చలు జరుపుతోంది. ఈ చిత్రంలో రకుల్ పాత్ర మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ అంశాలతో ఉండబోతోంది.
ఇదీ చదవండి: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో ప్రభాస్..
ఈ చిత్రాన్ని రకుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొన్ని హింట్స్ ఇస్తోంది. సమాజంలోని కొన్ని సమస్యలని సున్నితంగా చూపించాలి. నేను అన్ని రకాల పాత్రలకు సిద్ధం.కానీ కొన్ని సున్నితమైన సమస్యలని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది అంటూ కండోమ్ నేపథ్యంలో సాగే చిత్రంపై రకుల్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
డైరెక్టర్ తేజాస్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించనుంది. కండోమ్ టెస్టర్ అంటే.. కండోమ్ నాణ్యతని అనుభవపూర్వకంగా తెలుసుకుని కంపెనీకి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం. కాబట్టి ఈ చిత్రంలో రకుల్ కొన్ని శృంగారపరమైన సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com