శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్... రామ్ చ‌ర‌ణ్ తో బ్రూస్ లీ, ఎన్టీఆర్ తో నాన్న‌కు ప్రేమ‌తో, బ‌న్నితో స‌రైనోడు చిత్రాల్లో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు డైరెక్ట‌ర్ శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతుంది. ఇప్పుడు ఎందుకు శ్రీవాస్ కి థ్యాంక్స్ చెబుతుంది అనుకుంటున్నారా..? శ‌్రీవాస్ లౌక్యం చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇది ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.

లౌక్యం రిలీజ్ అయి నేటికి ఖ‌చ్చితంగా సంవ‌త్స‌రం అయ్యింది. ఈ సంద‌ర్భంగా ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ...లౌక్యం సినిమా నా కెరీర్ లో సెకండ్ ట‌ర్నింగ్ పాయింట్. అందుక‌నే లౌక్యం నాకు స్పెష‌ల్ మూవీ. న‌న్ను న‌మ్మి మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ శ్రీవాస్ కు థ్యాంక్స్ అంటోంది.లౌక్యం సినిమాలో న‌టించిన ర‌కుల్ కి లౌక్యం బాగా తెలుసనుకుంట‌..అందుకే సినిమా రిలీజ్ అయి సంవ‌త్స‌రం పూర్త‌యిన సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతుంది.