మహేష్ మూవీ ఓకే అయ్యాకా రకుల్ ఏం చేసిందో తెలుసా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోముందుగా హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నప్పటికీ ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేసారు.
ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ...పరిణీతిచోప్రాని తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో నాకు అవకాశం దక్కదు అనుకున్నాను. కానీ...నా పేరు పరిశీలిస్తున్నారని తెలిసింది. అది తెలిసి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు నేను కాశ్మీర్ లో ఉన్నాను. నన్ను సెలెక్ట్ చేసారని ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆనందం పట్టలేకపోయాను. ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక ఎగిరి గంతేసా. కథ వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను. మురుగుదాస్ సెన్సిబుల్ డైరెక్టర్, అందరూ చేసేలా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు...ఇద్దరితో సినిమాలు చేయాలనుకున్నాను. లక్కీగా ఒకే సినిమా ద్వారా నా రెండు కోరికలు నెరవేరబోతున్నందుకు దేవుడికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అంటుంది. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments