రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
నువ్వు సెలబ్రిటీవి అయితే నాకేంటి? ఇక్కడ కరోనా వైరస్ .. అంటూ ఈ చైనా వైరస్ ఉధృతి పెంచుకుంటూనే ఉంది కానీ.. తగ్గడం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా మంది ఈ కరోనా వైరస్ ప్రభావానికి గురైనవారే. తెలుగు సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే రాజశేఖర్ కుటుంబం, రాజమౌళి, కీరవాణి.. వారి ఫ్యామిలీలో మరికొంత మందికి కరోనా సోకింది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తమన్నాకు కోవిడ్ సోకింది. అందరూ కరోనా బారి నుండి తప్పించుకున్నవారే. తాజాగా ఈ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. కోవిడ్ సమయం నుండి షరుతులతో షూటింగ్‌కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్, వైష్ణవ్ తేజ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంది.
ఈ సినిమా షూటింగ్ తో పాటు సామ్ జామ్ వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంది. తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎక్కడో కరోనా సోకింది. తనకు కోవిడ్ 19 సోకిందని రకుల్ స్వయంగా తెలియజేసింది. తాను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటానని రకుల్ తెలియజేసింది. ఈమధ్య తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా రకుల్ రిక్వెస్ట్ చేసింది. రకుల్ కోవిడ్ ఎఫెక్ట్ నుండి బయటకు రావాలని పోస్ట్‌లు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments