రకుల్ ప్రీత్ టీ షర్ట్ ఛాలెంజ్

  • IndiaGlitz, [Sunday,April 12 2020]

నేటి త‌రం కుర్ర హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఫిట్‌నెస్ విష‌యంలో ఉన్నంత కేర్ మ‌రొక‌రికీ లేదంటే అవున‌న‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ర‌కుల్‌కు ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏదో ర‌క‌మైన ఎక్స‌ర్‌సైజ్ చేస్తూనే ఉంటుంది. స‌ద‌రు వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌నూ పోస్ట్ చేస్తుంటుంది. రీసెంట్‌గా కాళ్ల‌ను గోడ‌కు అనించి చేతుల‌తో శ‌రీరాన్ని బాలెన్స్ చేస్తూ టీ ష‌ర్ట్ ఎలా వేసుకోవాలో ర‌కుల్ చేసి చూపెట్టి అంద‌రికీ షాకిచ్చింది ర‌కుల్‌.

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత స్పీడుగా ర‌కుల్ కెరీర్ లేద‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం ఆమె రెండు చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా త‌మిళ చిత్రాలే. తెలుగులో ఎప్పుడో కమిట్ అయిన నితిన్, చంద్రశేఖర్ ఏలేటి సినిమా మాత్రమే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో రకుల్ జత కట్టింది. ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ ర‌కుల్‌పై శీత‌కన్ను వేసింది. ఇది కాకుండా బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో ‘థాంక్‌గాడ్‌’ సినిమాలోనూ ర‌కుల్ న‌టించ‌నుంద‌ట‌.