అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ .. హరీష్ శంకర్ సపోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లో రకుల్ మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన నటించింది. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల టాలీవుడ్ లో రకుల్ మునుపటి జోరు తగ్గినప్పటికీ మంచి ఆఫర్సే అందుకుంటోంది.
ఇదీ చదవండి: వైరల్ పిక్: RRR సెట్లో రాంచరణ్.. పవర్ ఫుల్ లుక్!
రకుల్ చివరగా ఈ ఏడాది తెలుగులో నితిన్ సరసన 'చెక్' మూవీలో మెరిసింది. అయితే తాజాగా రకుల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ లేవంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై రకుల్ మండిపడుతూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో అరడజను పైగా చిత్రాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత అన్ని చిత్రాల షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేయడంలో తనకు ఇబ్బందిగా మారుతోందని అందు వల్లనే టాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకోవాల్సి వస్తోంది అని రకుల్ ఇంటర్వ్యూలో చెప్పింది.
రకుల్ కామెంట్స్ ని వక్రీకరించే విధంగా కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. రకుల్ కు టాలీవుడ్ లో అవకాశాలే రావడం లేదని కొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై మండిపడుతూ రకుల్ స్పందించింది.
' నాకు ఓ విషయం అర్థం కావడం లేదు.. వీళ్ళు హెడ్డింగులు పెడుతున్నట్లు నాకు టాలీవుడ్ లో ఆఫర్స్ రావడం లేదని ఎప్పుడు చెప్పాను. 365 రోజుల్లో నేను ప్రస్తుతం చేస్తున్న 6 చిత్రాలకు కాకుండా కొత్త ఆఫర్స్ వస్తే వాటికి డేట్స్ సర్దుబాటు చేయండి. లేదంటే నా టీమ్ కు ఆ విషయంలో సాయం చేయండి' అని రకుల్ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చింది.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ రకుల్ కి సపోర్ట్ చేశాడు. 'నాకు తెలుసు రకుల్.. నా స్నేహితుడు చెప్పిన స్క్రిప్ట్ నీకు నచ్చినప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇలాగే దూసుకుపో.. నీ వర్క్ తో అందరికీ సమాధానం చెప్పు' అని హరీష్ శంకర్ రకుల్ కి సపోర్ట్ చేశాడు.
.. And I know one of my Friends struggled a lot to plan ur dates when u liked their script and
— Harish Shankar .S (@harish2you) June 20, 2021
the project got postponed because of ur busy schedule.
Keep Rocking @Rakulpreet and
Let your work speak !!! https://t.co/GHsVsAO36R
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments