రకుల్ శ్రీదేవి లుక్ ఎప్పుడంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఎన్.జి.కె, కార్తీతో ఓ సినిమా, శివ కార్తీకేయన్‌తో ఓ సినిమా ఇలా వరుస తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగణ్‌తో కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే రకుల్‌కు ఎంతో ఇష్టమైన టాలీవుడ్లో సినిమాలు మాత్రం చేయడం లేదు.
అయితే స్పైడర్ తర్వాత తెలుగులో రకుల్ చేస్తున్న చిత్రం `యన్.టి.ఆర్`. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`లో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అందుకోసం ఈ నెలాఖరున రకుల్ లుక్ టెస్ట్ జరగనుంది. ఈ పాత్ర కోసం రకుల్ 10 రోజుల కాల్షీట్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు కావడంతో అదే రోజున రకుల్ ... శ్రీదేవి లుక్‌ను విడుదల చేయబోతున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com