రకుల్ ఆవిషయంలో హ్యాట్రిక్ కొడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది వరుసగా మూడు హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న రకుల్.. ఈ ఏడాదిలో అయితే తన కెరీర్లోనే తొలిసారిగా ఏకంగా నాలుగు తెలుగు చిత్రాలు చేసింది. 'రారండోయ్ వేడుక చూద్దాం', 'జయజానకి నాయక' చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న భ్రమరాంబ, జానకి (స్వీటీ) పాత్రల్లో ఆకట్టుకుంది రకుల్.
ఆ రెండు చిత్రాల తరువాత ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా వస్తున్న చిత్రం 'స్పైడర్'. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ డైరెక్టర్. జనరల్‌గా మురుగదాస్ సినిమాల్లో కథానాయిక పాత్రకి ప్రాధాన్యముంటుంది. ఆ తీరున 'స్పైడర్'లోనూ రకుల్ కి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కితే.. వరుసగా మూడు సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి హ్యాట్రిక్ కొట్టినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments