న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్

  • IndiaGlitz, [Monday,February 08 2016]

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్...అనగానే..ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ లో. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే త‌ని ఓరువ‌న్ సినిమాలో న‌య‌న‌తార పోషించిన పాత్ర‌కు తెలుగులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ నాన్న‌కు ప్రేమ‌తో...సినిమా స‌క్సెస్ సాధించింది. రామ్ చ‌ర‌ణ్ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించే ఈ చిత్రానికి ర‌క్ష‌క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.