రకుల్ కి తమన్ ఈసారైనా అచ్చొస్తాడా?

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

కెరీర్ ప్రారంభంలో రెండు వ‌రుస విజ‌యాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఆ త‌రువాతే ఆమెకు అస‌లు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్నా.. హిట్ స్టేట‌స్ రిజ‌ల్ట్స్ అయితే ఆ భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌తో న‌టిస్తున్న 'స‌రైనోడు 'పై ర‌కుల్ బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకుంది. ఈ నెల 22న రానున్న ఈ సినిమా కోసం అంద‌రి కంటే ఎక్కువ ఆస‌క్తితో ఎదురుచూస్తోందీ ముద్దుగుమ్మ‌.
త‌మ‌న్ సంగీతమందించిన ఈ సినిమా పాట‌లు ఈ రోజే మార్కెట్‌లోకి నేరుగా విడుద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే.. గ‌తేడాది ర‌కుల్ న‌టించగా మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో ఏ సినిమా హిట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకోలేదు. విశేష‌మేమిటంటే ఆ సినిమాల‌న్నింటికీ త‌మ‌నే స్వ‌ర‌క‌ర్త‌. త‌న‌కు క‌లిసి రాని త‌మ‌న్ సంగీతంలో మ‌రోసారి 'స‌రైనోడు' కోసం న‌టించిన ర‌కుల్‌కి ఈ సారైనా హిట్ దొరుకుతుందేమో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు.

More News

సర్ధార్ లో వీణ స్టెప్ వచ్చేది అప్పుడే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ లో వీణ స్టెప్ ఉన్న సంగతి తెలిసిందే.

బాహుబలి 2 - రోబో2 ఒకేరోజు రిలీజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి-2.

కాజ‌ల్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో?

ఇంత‌కు ముందు వ‌ర‌కు త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఓ అంశం.. ఇప్పుడు కాజ‌ల్‌కి కూడా యాడ్ అవుతోంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన బాబాయ్ అబ్బాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోనూ, రామ్‌చ‌ర‌ణ్‌తోనూ రొమాన్స్ చేయ‌డం. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ‌లో న‌టించాక‌.. ప‌వ‌న్‌తో కెమెరామెన్‌గంగ‌తో రాంబాబు చేసింది త‌మ‌న్నా. ఇక శ్రుతి హాస‌

త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట తీరుతుందా?

మాట‌ల ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌కుడుగానూ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక  స్థానం ఉంది. అందుకే ఆయ‌న చెంత‌కు విజ‌యాలు.. అవ‌లీల‌గా వ‌చ్చి చేరుతుంటాయి.

త్రిష బాట‌లో త‌మ‌న్నా

ప‌దేళ్ల‌కి పైగా హీరోయిన్లుగా రాణిస్తున్న వైనం అందాల తార‌లు త్రిష‌, త‌మ‌న్నా సొంతం. త‌మ‌న్నా కంటే ముందు త్రిష కెరీర్ ని ప్రారంభించినా.. ఓ విష‌యంలో మాత్రం ఈ ఇద్ద‌రు కాస్త అటుఇటుగానే  అడుగులు వేస్తున్నారు.